D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : " ఖమ్మం/వైరా టౌన్ నవంబర్ 27 (అక్షరం న్యూస్) వైరా స్థానిక ఎస్.ఆర్ ఠాగూర్ విద్యాసంస్థలైన క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బాల్ వివాహ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బేటి బచావో, భేటీ పడావో నినాదంతో విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా మహిళా సాధికారత యూనిట్ జనరల్ స్పెషలిస్ట్ ఆర్ వాసంతి మాట్లాడుతూ 0-18 సంవత్సరాల ఆడపిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అదేవిధంగా 0-21 సంవత్సరాల మగ పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, అలా జరిగినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు. సమాచారం అందించగలరని, అదేవిధంగా ఫోక్సో 2012.. చట్టం లో ఉన్న విషయాలను, వివరించడం జరిగింది. వీటివల్ల మధ్యలోనే విద్యను నిలిపివేయడం ఆరోగ్యానికి హాని కలగడం, పేదరికం కొనసాగటం లాంటి పరిస్థితులు నెలకుంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా అధ్యాపకులకు పోషో చట్టం 2013 గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ఎన్ ఎస్ ఎస్ పి ఓ లింగారావు, నాగలక్ష్మి, కల్పన, మజీద్, వేణు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily