GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -09(అక్షరం న్యూస్ ) సిరిసిల్ల జిల్లా 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ 'సి' కంపెనీ సిబ్బంది వార్షిక రిఫ్రెషర్ కోర్స్ (ఏ ఆర్ సి )లో భాగంగా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో ఉన్న అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని బుధవారం సందర్శించారు. బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన పోలీసులు వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బియ్యం, పప్పులు, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. పోలీసు సిబ్బంది చూపిన ప్రేమాభిమానాలకు వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఆశీర్వాదాలు అందించారు. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో పోలీసుల అనుబంధం మరింత బలపడుతుందని, సేవాభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జె. రాందాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జె. రాందాస్, కంపెనీ ఆర్‌ఐ బండి కుమారస్వామి, ఆర్‌ఎస్‌ఐ సిరాజొద్దీన్, గూడెం గ్రామ సర్పంచ్ తాటిపాక శంకరయ్య, సావిత్రి, పద్మ, విజయ, ఏఆర్‌సీ శిక్షణలో పాల్గొంటున్న 'సి' కంపెనీ పోలీసు సిబ్బంది, శిక్షకులు, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily