AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ జూలూరుపాడు/ఆగస్టు30/అక్షరం న్యూస్: మండలంలోని పడమట నర్సాపురం లో గ్రామంలో బీజేపీ పార్టీ జూలూరుపాడు మండలం కార్యదర్శి నిమ్మటూరి రామారావు కుమారుడి వివాహ కార్యక్రమానికి ప్రముఖ నాయకులు తాండ్ర వినోద్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరులను కలిసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామ పెద్దలతో ఆప్యాయంగా ముచ్చటించారు.వినోద్ రావు రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అద్యక్షుడు భూక్యా రమేష్ ,రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ,చిలుకూరి రమేష్ మరియు స్థానిక నాయకులు ధారావత్ బాలకిషన్ , గోపాలరావు,రాంబాబు,చరణ్ ,రవి,బాబూలాల్ గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily