Saturday, 04 April 2026 01:40:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలే లక్ష్యం డివిజన్ ఇంజనీర్ అంజయ్య


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 03 April 2026 06:24 PM Views : 242

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : * రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -04(అక్షరం న్యూస్ ) ఎస్ఈ బి . బిక్షపతి ఆదేశాల మేరకు గంభీరావుపేట మండలంలోని ముస్తాబాద్ సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ ఉద్యోగులు, ఓ అండ్ ఎం సిబ్బందితో వేసవి కార్యాచరణ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ భద్రతపై సిరిసిల్ల డివిజన్ ఇంజనీర్ అంజయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇంజనీర్ అంజయ్య మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో లోడ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రమాదభరితంగా ఉన్న లైన్లను గుర్తించి మరమ్మతులు చేయడం, వంగిన విద్యుత్ స్థంభాలను తక్షణమే మార్చడం వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు (ఏ జి ఎల్ ) పెండింగ్‌లో ఉన్న సేవలను త్వరితగతిన విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ఏ.డి.ఈ శ్రీనివాస్ , ఏ.ఈ విష్ణు తేజ , ఓ అండ్ ఎం సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :