GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-27(అక్షరం న్యూస్) సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రం లోని మండలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఒక వ్యక్తి , వయస్సు సుమారు 45 సం. నుండి 50 సం లు, కల వ్యక్తి వర్షం కి తడిసి , వణుకుతు మాట్లాడలేని స్థితి లో ఉండగా , అతన్ని గమనించిన స్థానికులు పోలీసుల కు సమాచారం అందచేసారని తెలిపారు. ,వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కీ తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు , మృతుడు సన్నగా , చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడని , కుడి చెంప పై పుట్టుమచ్చ కలిగి, కొద్దిగా బట్ట తల కలిగి ఉన్నాడని తెలిపారు , మృతుని పై నలుపు రంగు డ్రాయర్ (షార్ట్)మాత్రమే కలిగి ఉన్నట్లు తెలిపారు , ప్రస్తుతం మృతుని శవం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లో మార్చురీ గది లో కలదని, వివరాల కోసం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ( 8712656371 ) లో సంప్రదించగలరని తెలిపారు.
.
Aksharam Telugu Daily