Saturday, 14 November 2026 05:45:43 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అర్హులందరికీ "చేయూత"నిస్తాం.. అండగా నిలుస్తాం.. గత ప్రభుత్వ హయాంలో..పేదలు కాళ్లరిగేలా తిరిగినా, కళ్ళు కాయలు కాసేలా చూసినా కనికరించలేదు దీపావళి నాడ

నేలకొండపల్లిలో 1,138 మంది నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 November 2026 04:16 PM Views : 70

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 13 (అక్షరం న్యూస్) *నేలకొండపల్లి:* ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా అందించాలని గొప్ప సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం చేయూత పథకం ద్వారా అర్హులందరికీ అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నేలకొండపల్లిలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో చేయూత పథకం కింద నూతనంగా 1,138 మందికి పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోని 8 ఏళ్లలో కొత్త పింఛన్లు అనేదే ఇవ్వలేదని, కాళ్ళరిగేలా తిరిగినా, కళ్ళు కాయలు కాసేలా ఏళ్లుగా ఎదురుచూసినా వారు చలించలేదని, ఎన్నికలకు ముందు తన పర్యటనల్లో పేదల గోస చూసి ఆవేదన చెందానని మన ప్రజా ప్రభుత్వం వచ్చాక.. కొత్తగా పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ రోజన రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించి.. ఆచరణలోకి తెచ్చామని అన్నారు. గత పాలకులు కమీషన్ల కోసం లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి.. కూలేశ్వరంగా మిగిల్చారని విమర్శించారు. ఇంకా అర్హులు ఉంటే.. కచ్చితంగా పింఛన్లు మంజూరు చేసి అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని అభయమిచ్చారు. *నేలకొండపల్లి మండలంలో 1,138 మందికి కొత్త పింఛన్లు..* *నెలకు రూ.30.16 లక్షల మేర ఆర్థిక భరోసా* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకం ద్వారా నేలకొండపల్లి మండలంలో కొత్తగా 1,138 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వీరికి ప్రతినెలా మొత్తం రూ.30,16,208 పింఛను రూపంలో అందనుంది. నవంబర్ 13, 2026 నాటికి మండలంలో మంజూరైన కొత్త పింఛన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. వర్గాల వారీగా వివరాలు ఇలా.. *దివ్యాంగులు – 361 మంది* (నెలకు రూ.14,49,776) *ఒంటరి మహిళలు – 107 మంది* (రూ.2,15,712) *గీత కార్మికులు – 64 మంది*(రూ.1,29,024) *చేనేత కార్మికులు – ఇద్దరు*(రూ.4,032) *వితంతువులు – 604 మంది*(రూ.12,17,664) *మొత్తంగా 1,138 మందికి నెలకు రూ.30.16 లక్షలకుపైగా పింఛన్ల రూపంలో ఆర్థిక సహాయం అందనుంది.* దివ్యాంగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.4,016, మిగిలిన వర్గాలకు రూ.2,016 చొప్పున పింఛను మంజూరైనట్లు అధికారులు తెలిపారు. పాత పింఛన్లతో కలుపుకొని మొత్తం 9,428 మందికి నెలకు రూ.1,64,40,896 లబ్ధి చేకూరుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో..: అడిషనల్ కలెక్టర్ శ్రీజ, కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొడాలి గోవిందరావు, సీనియర్ నాయకులు శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, పలువురు సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ప్రజా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :