GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 20 అక్షరం న్యూస్; జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి గారు బొమ్మినేని హాస్పటల్ ను తనకి నిర్వ హించినారు. ఈ హాస్పిటల్ నందు చాలా లోపాలను గమనించడం జరిగింది. సంతానా సాఫల్యత హాస్పటల్ అని బోర్డు కలదు కానీ ఆ ఆ సర్వీస్ చేయటకు పర్మిషన్ లేదు. డాక్టర్ షాహిన్ పేరు హాస్పిటల్ డాక్టర్ ఇన్చార్జిగా నమోదు కాగా ఆమె అందుబాటులో లేదు. వై రమేష్ బాబు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అందుబాటులో లేడు. కన్సల్టెంట్ డాక్టర్స్ గా రిజిస్ట్రేషన్ కానీ డాక్టర్ల పేర్లు బోర్డుపైన ప్రదర్శించారు. వారు డాక్టర్ సుప్రియ, డిజిఓ, డాక్టర్ బి దుర్గారాణి, డిజిఓ, డాక్టర్ వివేక్ లాప్రోస్కోపిక్ సర్జన్, అదే విధంగా రిజిస్టర్ అయిన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ లు కాకుండా వేరే సిబ్బంది పని చేయు చున్నారు. డా. దుర్గా రాణి పైన సి.ఏం ఆర్. ఎఫ్. రి ఇంబర్స్ మెంట్ దుర్వినియోగ పరిచినట్టు అభియోగం గల శ్రీ సాయి ఆసుపత్రి అధినేత. వారే మళ్ళీ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేయుచున్నారు. ఈరోజు ఒకరికి ఆ డాక్టరే సంతానం కాకుండా ఆపరేషన్ చేసినట్టు రికార్డులలో కలదు. కానీ ఆస్పత్రి డాక్టర్ కూడా అందుబాటులో లేడు. ఈ లోపాలను గుర్తించి ఆ ఆస్పత్రి యొక్క ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయడం జరిగినది.
.
Aksharam Telugu Daily