Friday, 24 July 2026 05:45:26 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బొమ్మ వెంకన్న


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 19 March 2025 09:30 AM Views : 967

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 18(అక్షరం న్యూస్ ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న 6 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగారం రోడ్డులో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ అధికారం ఉన్న లేక పోయిన హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని అన్నారు. పార్టీలకతీతంగా బొమ్మ వెంకన్నకు అభిమానులను ఉన్నారన్నారు. గెలుపోటములు కాకుండా ప్రజలకు సేవా చెయ్యాలని బొమ్మ వెంకన్న అనేవారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ శాసన సభ్యుడిగా బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రాంతానికి దక్కిందన్నారు. బొమ్మ వెంకన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :