D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం / వైరా, నవంబర్ 26 (అక్షరం న్యూస్):* వైరా మండల పరిధిలోని లింగన్నపేట గ్రామంలో పంట క్షేత్రాలను సర్పంచ్ చంగల్ల పరశురాం అధ్యక్షతన మండల వ్యవసాయ అధికారి మయాన మంజు ఖాన్, తాసిల్దార్ సురేష్, ఆర్ఐ సోయం రఘు, వ్యవసాయ విస్తరణ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తెలియజేశారు. వరి ఉల్లికోడు తెగులు వల్ల దిగుబడి తగ్గుతుందని, సెప్టెంబర్ 10 తర్వాత విత్తనాలు వేయడం వల్లే తెగులు వచ్చిందని, నివారణకు కార్బోఫ్యూరాన్ 3G, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు వాడాలని సూచించారు. రైతులు తోటకూరి బాబురావు, తోటకూరి నాగేశ్వరరావు, బాణాల కృష్ణమాచారి, జంజునూరి దాసు, తోటకూరి భద్రయ్య పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily