GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-13(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు ముదిరాజ్ సంఘం భవనంలో అధ్యక్షుని ఎన్నిక రసవత్తంగా జరిగింది ముదిరాజ్ సంఘం పెద్దమనుషుల సమక్షంలో మండలం లోని24 గ్రామాల ముదిరాజ్ సంఘానికి చెందిన 24 ఓటర్లతో కూడిన ఎన్నిక జరగగా అధ్యక్షుని పోటీలో ఇద్దరు అభ్యర్థులు పిట్ల విట్టల్, చాడ శ్రీనివాస్ బరిలో పోటీగా ఉన్నారు. ఈ పోటీలో మండల కేంద్రానికి చెందిన విట్టల్ రెండు ఓట్ల మెజార్టీ విజయం సాధించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఎన్నడు లేని విధంగా ఓటింగ్ విధానంలో అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించడం ఇదే తొలిసారి అని ముదిరాజ్ సంఘం పెద్దలు కొనియాడారు ప్రస్తుతం కాలంలో ఓటింగ్ నిర్వహించి అధ్యక్షునిగా ఎన్నుకోవడం మంచిదని ఎన్నిక నిర్వహించిన పెద్ద మనుషులు తెలిపారు. గతంలో సంఘం పెద్దమనుషులు ఒక వ్యక్తికి నామకరణం చేయంగా అదే వ్యక్తి అధ్యక్షునిగా కొనసాగే వారు ఇప్పటి రోజులు మనుషులకు అర్థమయ్యే విధంగా ఎన్నికల జరగడం మంచిదే అని సంఘ పెద్దమనుషులు కొనియాడారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా పిట్ల విట్టల్ ఉపాధ్యక్షులు .కంచం నరసింహులు, .జింక మల్లేశం, .ఈర్ల విద్యాధర్, .గాడిచర్ల రామచంద్రం, ప్రధాన కార్యదర్శి. జింక పవన్, జెల్లా శ్రీకాంత్,* సహాయ కార్యదర్శి .జాల బిక్షపతి .నిమ్మల రాములు .గీస బిక్షపతి 4సోమరిపేట నర్సింలు కోశాధికారి బోయిని గంగాధర్,లను ఎన్నుకున్నారు ఈ సందర్బంగా క్షేత్రస్థాయి ముదిరాజ్ సంఘం అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ. సంఘం అభివృద్ధికి ఐక్యత భావంతో తమ సహాయ సహకారాలు సంఘానికి అందిస్తూ ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయడానికి సంఘానికి సహకరిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంఘం నాయకులు మాజి మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ గాడిచర్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. . నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షునికి కార్య వర్గానికి ముదిరాజ్ సంఘ సభ్యుల నుండి శుభాకాంక్షలు తెలియజేసారు
.
Aksharam Telugu Daily