Sunday, 29 March 2026 03:28:36 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మండల వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు  ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం: ఎస్ ఐ చిందం గణేష్

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 02 December 2025 06:31 PM Views : 548

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-02(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుమికూడడం నివారించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ముస్తాబాద్ మండల పరిధిలో ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధమని తెలిపారు. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయని, అందరూ తప్పనిసరిగా పాటించాలి” అని హెచ్చరించారు. ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందాలన్నారు. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయని మండల ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్ ఐ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :