Friday, 06 March 2026 03:07:47 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ వలలో సర్వేయర్‌

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 14 October 2025 03:57 PM Views : 1679

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -14(అక్షరం న్యూస్ ) భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి నుండి 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ కు చిన్న బోనాలలో 3 ఎకరాల భూమిని సర్వే చేయడం కోసం సర్వేయర్ వేణు 30 వేల రూపాయలు డిమాండ్ చేయగా, బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.మొదట సర్వేయర్ కు 10వేల రూపాయలు అప్పజెప్పాడు. తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మరో 20వేల రూపాయలు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు, సర్వేయర్ వేణు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో వరుసగా సర్వేయర్ లపై ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయిమొన్న మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ పట్టుబడగా, నేడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ఏసీబీ ట్రాప్ లో పట్టుబ‌డటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా మరో వైపు పలు డిపార్ట్ మెంట్ ల అధికారుల తీరు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :