GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జూన్ -18(అక్షరం న్యూస్ ) పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో నామపూర్ గ్రామ సర్పంచ్ తన కూతురిని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని నామ పూర్ గ్రామానికి చెందిన మాదాసు అనిల్ ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.తన స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో శుక్రవారం తన కుమార్తె అభిజ్ఞ ను ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి లొ చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే సందేశాన్ని సమాజానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన చర్యను గ్రామస్థులు అభినందిస్తూ, ఇతర తల్లిదండ్రులకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారుఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డీ , ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు . ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలాంటి చర్యలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు ప్రజా ప్రతి నిధులు ప్రభుత్వ విద్యపై నమ్మకం ఉంచి తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు భాస్కర చారి, భాస్కర్, సుధాకర్, సుధాకర్, సువర్ణ, పీడీ శ్రీనివాస్, నాగేశ్వర్లు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily