Monday, 16 February 2026 04:31:47 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కాంగ్రెస్‘ క్లీన్ స్వీప్. ఫలించిన అభివృద్ధి అంశం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 13 February 2026 12:49 PM Views : 612

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్,( పెద్దపల్లి జిల్లా), ఫిబ్రవరి 13.అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 15 వార్డులకు 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘క్లీన్ స్వీప్’ చేయడంతో బీఆర్‌ఎస్, బీజేపీలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గత కొంత కాలంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని స్పష్టంగా తెలిసిపోయింది. ఎమ్మెల్యే విజయ రమణారావు‘అభివృద్ధి’ అంశానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఈ ఫలితాలతో తేట తెల్లం అయ్యింది.ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పట్టణంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ “ఇది ప్రజల విజయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం” అని ప్రకటించారు.మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కొన్ని వార్డుల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, చివరికి ప్రజల తీర్పు కాంగ్రెస్‌కే అనుకూలంగా మారింది. పట్టణంలో ప్రత్యర్థి పార్టీల స్థానిక నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పట్టు ను నిరూపించాయి. గెలిచిన అభ్యర్థుల వివరాలు వార్డు ల వారిగా.. 01) ఈర్ల స్వరూప (కాంగ్రెస్), 02) గాజుల రాజమల్లు ( కాంగ్రెస్) 03) కందునూరి సమత (బీజేపీ) 04) బిరుదు కృష్ణ (కాంగ్రెస్) 05) గరిగే శోభారాణి (కాంగ్రెస్) 06) బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్) 07) వర ప్రదీప్ (కాంగ్రెస్) 08) చింతల రాజు (కాంగ్రెస్) 09) టికే ప్రభాకర్. (కాంగ్రెస్) 10) అంతటి పుష్పలత(కాంగ్రెస్) . 11) కల్వల శంకరమ్మ (BRS) 12) అమీరిశెట్టి శ్రావణి (AIFBP) 13) సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్) 14) వేగోళం పద్మ (కాంగ్రెస్) 15) గాదాసు మంజుల (కాంగ్రెస్)

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :