GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్, జూన్ 14 (అక్షరం న్యూస్) కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్ధి అజయ్ ఇటీవల ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఘట్కేసర్, హైదరాబాద్ లో జరిగిన వేదిక్ మాథ్స్ అండ్ కార్టూన్ మేకింగ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఇంకో విద్యార్థి నరేష్,ఇంటర్ ద్వితీయ జూనియర్స్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ టోర్నమెంట్ ఇటీవల నిజామాబాద్ లో జరిగింది. దీనిలో ఇతను బెస్ట్ అప్ కమింగ్ బాక్సర్ ట్రోఫీ అందుకున్నాడు. ఇంకో విద్యార్ధి దుర్గారాజ్, తొమ్మిదవ తరగతి తెలంగాణ రాష్ట్ర జూనియర్ హాకీ టోర్నమెంట్ అదిలాబాద్ లో ఈ నెల 10 నుండి 12 వరకు జరిగిన పోటీలలో రాణించినందుకు ప్రత్యేక బహుమతి అందుకొన్నాడు. ట్రోఫీలు గెల్చుకొన్న విద్యార్థులను, పీడీ పీ ఇనాక్ ని ప్రిన్సిపాల్ జి. కాళహస్తి అభినందించారు.
.
Aksharam Telugu Daily