AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /జూలూరుపాడు/జులై 10/ అక్షరం న్యూస్ : మండల కేంద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి నీటి ఆధారం లేని ప్రాంతం, వర్షం పై ఆధారపడే ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని ఎదురుచూసిన రైతులకు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు, జూలూరుపాడు నుంచి ఏన్కూర్ నాగార్జునసాగర్ ఎడమకాలకు గత సంవత్సరం ఎటువంటి పర్మిషన్ లేకుండా రెండు నెలలోనే కాలువకు నీళ్లు వదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యిన జూలూరుపాడు మండల రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు. జూలూరుపాడు మండలంలో రైతులు భూములు కోల్పోయి రైతుల సొంత భూముల నుంచి కాలువ నీళ్లు పోతుంటే నా పొలానికి నీళ్లు ఇవ్వట్లేదని కన్నీళ్లు పెడుతున్నారు. గత సంవత్సరం ఈ ప్రాంతవాసులు నీళ్లు ఇవ్వాలంటే మేము వెంటనే పిల్ల కాలువలు ఏర్పాటు చేసి మీ ప్రాంత వాసులకు నీళ్లు ఇస్తామని ఎమ్మెల్యే, మంత్రి హామీ ఇచ్చారు కానీ ఈరోజు వరకు కూడా సంవత్సరం గడిచిన కూడా ఈ ప్రాంత వాసులకు చుక్క నీళ్లు ఇవ్వలేదు, ఈ ప్రాంత వాసులకు నీళ్లు ఇచ్చాక మిగులు జలాలను మాత్రం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలి. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల వారి ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు, ఉపవాసం ఉన్నోడికి అన్నం పెట్టకుండా అన్న ఉన్నోడికి పరవన్నం పెట్టినట్టుగా నీళ్లున్న కాలవకే నీళ్లు తీసుకెళ్లారు. ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాది కొత్తగూడెం జిల్లాలో సీతారాం ప్రాజెక్టు నీళ్లు ఈ జిల్లా రైతులకు ఇచ్చాకనే మిగులు జలాలు మాత్రమే ఇతర ప్రాంతాల తీసుకెళ్లాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్, మాజీ మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, నర్వనేని కృష్ణ, వెంకటేశ్వర్లు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily