GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -13(అక్షరం న్యూస్ ) రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రం లో శాలివాహన యువజన సంఘము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు -మొల్లమాంబచిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం కు మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్తాళ్ల విజయ్ రెడ్డి హాజరై నివాళులు అర్పించారు. అనంతరం యువజన సంఘ సభ్యులు మా ట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడంతో పాటు నాటి సమాజంలో నెలకొన్న లింగ, కుల వివక్షతలను బద్దలు కొట్టి చరిత్రలో చిరస్థాయిగా మొల్లమాంబ నిలిచిందని కొనియాడారు. రానున్న మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపాలని డిమాండ్ చేశారు. కుమ్మరి కులస్థులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతో పాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో శాలివాహన యువజన కమిటీ సభ్యులు, పట్టణ,యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily