Sunday, 23 August 2026 04:02:39 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ముమ్మరం ఆగస్టు 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ విజ్ఞప్తి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 22 August 2026 05:20 PM Views : 31

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "చేయూత" పెన్షన్ పథకం లబ్ధిదారుల ఎంపిక మరియు దరఖాస్తుల ప్రక్రియ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలో మొత్తం 644 దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉన్నప్పటికీ, చివరి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి, అర్హులైన దరఖాస్తుదారులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా ఉండేందుకు, ఆగస్టు 25 తేదీలోపు పెన్షన్ దరఖాస్తుకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తమ వార్డు ఆఫీసర్‌ కు ఇవ్వాలని లేదా మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలని, తమ దరఖాస్తు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :