Tuesday, 10 February 2026 08:15:22 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆనంతుల లక్ష్మీనారాయణ ఎన్నిక


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 November 2025 06:32 PM Views : 645

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / 30 నవంబర్/ అక్షరం న్యూస్ : కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కూలి లైన్ లో గాన ఖెమిస్ట్ భవన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధిరకారి పసునూతి వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అద్యక్షుణిగా అనంతుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గా దూలం నటరాజ్, అసోసియేట్ అధ్యక్షునిగా గొట్టిముక్కుల మహేందర్, కోశాధికారి గా పుట్ట లింగమూర్తి, ఉపాద్యక్షులుగా బేతి రమేష్, కొండి పద్మజ, కొండ సర్వేశ్వర రావు, వేముల మురళి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా బాతాల వెంకటేశ్వర్లు, పెంటి సురేష్ కుమార్, దాసరి సమ్మయ్య, పొరండ్ల శ్రీనివాస రావు, ఆర్గనైజేశనల్ సెక్రెటరీ గా పసునూతి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రేటరీలు గా వన్నాల విద్యాసాగర్, మెర్గు ఉమా శంకర్, లలిత లక్ష్మీ, పబ్లిసిటీ సెక్రేటరి గా దిగిదారి రాము కార్యవర్గ సభ్యులుగా బీంగి గోపాల్, పాశికంటి గాయత్రి లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి పసునూతి వెంకటేశ్వర్లు ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భావంగా వ్యవసాయ మంత్రి వర్యులు, జిల్లా కాలెక్టర్ జితెశ్ బి. పాటిల్ నుండి ఉత్తమ జిల్లా అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న గొట్టిముక్కుల మహేందర్, ఉత్తమ ఉద్యోఊగులుగా ప్రశంసా పత్రాలు అందుకున్న ఆనంతుల లక్ష్మీనారాయణ, బేతాళ వెంకటేశ్వర్లు, దిగిదారీ రాము లను నూతన సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా సంఘ అద్యక్షులు అనంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెద పద్మశాలీల అభివృద్ధికి సంఘ సభ్యులు తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అంధించాలని ఉద్యోగులు ప్రభుత్వ పథకాలు పెద ప్రజలకు అందేలా కృషి చేయాలని, పెద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్ధికంగా సహాయ సహకారాలు అందించాలని, ప్రతీ నెలలో కనీసం 500.00 ల చేనేత వస్త్రములు కొనుగోలు చేయాలని, ప్రతీ సోమవారం అందరూ చేనేత వస్త్రములు ధరించి చేనేత కార్మికులకు చేయుత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కార్యక్రమం లో జిల్లా సంఘ సభ్యులు, చిప్ప వెంకట రమణ, పుట్ట శంకరయ్యా తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :