D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/జూన్ 27(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం దళిత జర్నలిస్టు ఐక్య వేదిక గంగారం మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.గురువారం మండల కేంద్రము లోని కోమట్లగూడెం లో దళిత జర్నలిస్టు ఐక్య వేదిక విస్తృతస్థాయి సమావేశం తీగల ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగింది.దళిత జర్నలిస్టు ఐక్య వేదిక నూతన మండల అధ్యక్షులుగా దుర్గం మురళి నేత (అక్షరం).ఉపాధ్యక్షులుగా జనగాం ముత్తయ్య(ప్రజాజ్యోతి).ప్రధాన కార్యదర్శి గా మెంతిని సురేష్(జన సముద్రం).కోశాధికారిగా దుర్గం ప్రభాకర్(ఉదయం).గౌరవ అధ్యక్షులుగా జాడి భరత్ కుమార్(ప్రజాతంత్ర).కార్యదర్శిగా గోగు రవి(సాక్షి).ప్రచార కార్యదర్శిగా జాడి భార్గవ్ (ఉదయ అక్షరం)లను ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుర్గం మురళి నేత మెంతిని సురేష్ లు మాట్లాడుతూదళిత జర్నలిస్టు హక్కుల కోసం ఉద్యమాలు చేస్తామని తెలిపారు.మా మండల కమిటీ ఎన్నికకు సహకరించిన జిల్లా నాయకత్వానికి గంగారం మండల సహచర జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily