D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *.. * ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ అక్టోబర్ 31 (అక్షరంన్యూస్) మాకు మార్కెట్ అధికారుల అండ దండలు ఉన్నాయి. ఎవరుమమ్మల్ని ఎమి చేయ్యలేరు.. అని అంటున్నా అనుమతులు లేని వ్యాపారుల నోటి మాటలు వినిపిస్తున్నాయి.. తల్లాడలో అనుమతి లేని పత్తి కొనుగోలు వ్యాపారుల నోటి మాట తల్లాడ లో అనుమతు లేకుండా ప్రభుత్వ ధనాన్ని డ్యూటీ చేసే విధంగా పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కేంద్రాలు తల్లాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. మా దందాకు ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదని వైరా వ్యవసాయ మార్కెట్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తల్లాడలో సరికొత్త నోటి మాట ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తుంది. అధికారులు వచ్చేముందు మాకు సమాచారం ఇస్తారని వచ్చిన నామమాత్రంగా ఇస్తారు తప్ప మాపై ఎలాంటి చర్యలు తీసుకోరని బహిరంగంగా అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు అనడం వెనక ఒక చీకటి ఒప్పందమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చును, వ్యవస్థలను ప్రక్షాళన చేసి మార్కెట్ ఆదాయాన్ని పెంచవలసిన బాధ్యత గల అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం ఒకపక్క అవినీతికి తావు లేదని పరిపాలన అందించాలని చెబుతూ ఉంటే దీనికి భిన్నంగా వైరా వ్యవసాయ మార్కెట్ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అసలు అనుమతి లేని పత్తి కౌంటర్ల వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనిపై జిల్లా అధికారులు జోక్యం చేసుకొని నీకు తేల్చాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily