D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భ(ధా(ది కోత్తగూడెం జిల్లా/ గుండాల/ ఆగష్టు 6(అక్షరం న్యూస్ ) గుండాలమండలంలోని తుడుందెబ్బ ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో గ్రామ గ్రామాన తుడుందెబ్బ నాయకులు జెండాలు ఆవిష్కరణ చేశారు ముఖ్యంగా శెట్టిపల్లి లో జెండా ఆవిష్కరణ చేసి కోమరం భీం కు పూల మాల వేయడం జరిగింది. జిల్లా నాయకులు కల్తీ మల్లయ్య అధ్యక్షతన జెండా ఆవిష్కరణ గ్రామ పటేల్ మండల సహాయ కార్యదర్శి ఇర్ప రాజేంద్ర ప్రసాద్ ఎగుర వేశారు. మండల ఉపాధ్యక్షుడు ఇర్ప కృష్ణ మాట్లాడారు అనంతరం రేగులగుడెం, శంభునిగూడెం, వెన్నెల బైలు గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ దొర పటేళ్లు మరియు ఆదివాసి యువకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily