Sunday, 29 March 2026 04:55:51 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల సన్నాహక సమావేశం


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 24 January 2026 07:46 PM Views : 481

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : వరంగల్/జనవరి 24, (అక్షరం న్యూస్) రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హాజరయ్యారు. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ .భూక్య మురళి నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ , మహాబాద్ డి సి సి అధ్యక్షురాలు భుక్యా ఉమా మురళి, మాజీ డీసీసీ భరత్ చంద్ర రెడ్డి తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేయాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వరంగల్ డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :