D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) ఖమ్మం : 1వ పట్టణం 18వ డివిజన్ నందు శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ చైర్మన్ చిర్ర రవి , టీవీ పుల్లo రాజు మరియు వారి కమిటీ ద్వారా ఏర్పాటు చేయబడిన అయ్యప్ప మండపాన్ని భారతీయ జనతాపార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , మండల అధ్యక్షులు గడీల నరేష్ లు పూజలో పాల్గొని అనంతరం జరిగిన మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేయటం జరిగింది . ఈసందర్బంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హైందవ ధర్మం లొ భాగంగా గత 7 సంవత్సరాల నుండి ప్రతీ కార్తీకమాసం నందు ఈ అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేసి సుమారు 45 రోజుల పాటు ప్రతిరోజూ సుమారు 1500 మంది అయ్యప్పలకు అన్నసంతర్పణ కార్యక్రమంను నిర్వహిస్తున్న శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ కి ధన్యవాదములు తెలుపటం జరిగింది . వృత్తి రిచ్చా అయ్యప్ప మాలదారులు పలు చోట్లో పనిచేయు వారికి భోజన వ్యవస్థను ఒకేవేదిక పైన అందించాలనే దృక్పధంతో ఆలయాన్ని తలపించే వాతావరణంతో మండపాన్ని ఏర్పాటు చేసి నిత్యం అయ్యప్ప నామస్మరణ , శరణుఘోషతో ఈకార్యక్రమం నిర్వహించడం సంతోషం అన్నారు . ఈ కార్యక్రమంలో మండప సభ్యులు శ్రీరాముల వీరభద్రం , నిదిగొండ శేఖర్ , పుట్ట మల్లికార్జున్ , కూరపాటి రవితేజ , ఉప్పల భూపతి రెడ్డి , శ్రీనివాస్ , బీజేపీ నాయకులు నెల్లూరి బెనర్జీ , బండ్ల రిగాన్ ప్రతాప్ , పొట్టిమూతి జనార్దన్ , గడల నరసింహారావు , నేరెళ్ల శ్రీనివాస్ , పాలేపు రాము , మేడ సంపత్ తదితరులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily