AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు, అక్షరం న్యూస్/ సెప్టెంబర్ 5; భూర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో పరశురాం పరివార్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో నటరాజ క్లాసికల్ ఇన్స్టిట్యూట్ చే నృత్య కళా ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పరశురాం పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో రెండు నెలల వ్యవధి లోనే నృత్యం నేర్చుకొని చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చారు అని, చిన్నారుల ప్రదర్శన పలువురిని ఆకర్షించిందని కొనియాడారు, పిల్లల గురువు అయినటువంటి చెల్లూరి లక్ష్మీ లిఖిత నూతనంగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి చాలా తక్కువ టైం లో పిల్లలకు చాలా చక్కటి ను త్యాలు నేర్పించారు అని, మరుగున పడుతున్న మన కళలను ఇంకా ఇలాంటి వారు బ్రతికిస్తున్నారు అని వారికి పరశురాం పరివార్ హిందూ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు కళా ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు శాలువాతో సన్మానం చేసి అయోధ్య బలరాముని చిత్రపటాలను మరియు సంస్థ ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పరశురాం పరివార్ హిందూ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి సాయి కిరణ్ పరశురాం పరివార్ సభ్యులు నాగబాబు, పవన్ కళ్యాణ్, భవానీ, దేవి, లక్ష్మీ, శ్రావణి, నీరజ, హరిత తదితరులు పాల్గొన్నారు...
.
Aksharam Telugu Daily