P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి అక్టోబర్ 26 (అక్షరం న్యూస్) ఓదెల నుండి కనగర్తి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఓదెల గ్రామ శివారులో ఓర్రగడ్డ సమీపంలో కల్వర్టు హఠాత్తుగా కుల డంతో ప్రయాణికులు వాహనదారులు భయభ్రాంతులకు లోనయ్యారు నిత్యం వందలాది వాహనాలు ఈ దారిన నడుస్తున్నాయని పొరపాటున అది గమనించక వెళితే ప్రమాదం తప్పదని పలువురు చెబుతున్నారు వెంటనే అధికారులు దీనిపై చర్యలు తీసుకొని మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు వరి పొలాలు కోత పట్టిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని వరి ధాన్యం తెచ్చుకోవడం అదేవిధంగా వరి కోసే యంత్రం పోలేని పరిస్థితి ఏర్పడదని ప్రయాణికులకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు
.
Aksharam Telugu Daily