Thursday, 21 May 2026 05:44:02 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. వరి కొనుగోళ్లలో రాష్ట్రంలో నాల్గవ స్థానంలో పెద్దపల్లి. కటింగ్ లేకుండా కొనుగోలు చేసే నియోజకవర్గం పెద్దపల

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 May 2026 04:11 PM Views : 44

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 20 అక్షరం న్యూస్ ఆధారాలు లేకుండా రాజకీయ పబ్బం కోసం ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు హెచ్చరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు మాట్లాడుతూ రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఖండించారు. నియోజకవర్గంలో రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని వివరించారు. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని తెలిపారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడే అర్హత మనోహర్ రెడ్డికి లేదని, ఆయన హయంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో క్వింటాలుకు పది నుండి పదిహేను కిలోల వరకు కోతలు విధించి రైతుల నడ్డి విరిచిన ఘనత మనోహర్ రెడ్డిదని విమర్శించారు. ఆ విషయం రైతులు కూడా ఎక్కడి వెళ్లినా చెబుతారని అన్నారు. రాష్ట్రంలోనే వరి కొనుగోళ్లలో పెద్దపల్లి నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. మనోహర్ రెడ్డికి తెలిసినంత అక్రమ దందాల గురించి మాకెవ్వరికి తెలియదని, వారి ప్రభుత్వ హయంలో ఇసుక మాఫియా, మట్టి అక్రమ దందాలు చేసింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. మనోహర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరందిచక అరిగోస పెట్టి అన్నదాతల ఆదాయానికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతన్న మొహంలో ఆనందం చూసామని వివరించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట విషయంలో కూడా ఎలాంటి కోతలు లేకుండా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్ లేకున్నప్పటికీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. గత బిఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దాసరి లీలలు ఇంతా అంత కావని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రమేయంతో ప్రజా ప్రభుత్వంపై లేని పోనీ విమర్శలు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అక్కడక్కడ ఉన్న మీ తాబెదరులతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళాలు చేస్తామంటే లెక్క సరిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము, తమ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పని చేస్తుందని, చివరిగింజ వరకు వరి ధాన్యం, మొక్కజొన్న మద్దతు ధరకు కోనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు మరియు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల మరియు పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :