AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : * ** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బుర్గంపాడు, అక్షరం న్యూస్ /ఆగస్టు 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని జింకలగూడెం గ్రామం వద్ద ఖాళీగా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ కాలువకు చెందిన భూములను కలెక్టర్ జితేష్ వి పాటేల్ పరిశీలించారు. ఖాళీగా ఉన్నటువంటి భూములను మహిళ స్వయం సహాయక ఉపాధి సంఘాల ఆధ్వర్యంలో కూరగాయ పంటలను మరియు వాణిజ్య పంటలను సాగు చేపించవలసిందిగా అధికారులకు సూచించారు. ఈ భూముల్లో పంటలు పండించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. మహిళాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు. వాణిజ్య పంటలైన పట్టు పరిశ్రమ, మలబర వేప, వెదురు మొదలగు పంటలకు కావలసిన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇట్టి భూముల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఆక్రమించినచో చట్టరీత్య శిక్షింపబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ అధికారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
.
Aksharam Telugu Daily