Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 10(అక్షరం న్యూస్ ) కళాజ్యోతి పెయింట్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కళాజ్యోతి పెయింట్ సంఘం అధ్యక్షులు రాయకుంట చందు మరియు ప్రధాన కార్యదర్శి దొబ్బల అనిల్ కుమార్ సోమవారం కళా జ్యోతి పెయింట్ ప్రచార కార్యదర్శిగా వేముగంటి బాబును నియమించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రాయకుంట చందు మాట్లాడుతూ ఈ నెల 15 తారీకు శనివారం రోజున కార్మిక సోదరులు పనికి సెలవు పెట్టి అందరూ సమ్మక్క సారలమ్మ గద్దెకు రావాలని, అదేవిధంగా సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గంగారపు రవీందర్. సావుల మధు,బోరగళ్ళ సుమన్,కొంకటి కిరణ్,బెజ్జంకి సతీష్, తునికి శ్రీధర్ లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily