AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 17 అక్షరం న్యూస్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పెద్దపల్లి పట్టణం బండారికుంట 19వ వార్డుకు చెందిన మహమ్మద్ షఫీ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన యూత్ సభ్యులతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ ఆద్వర్యంలో పార్టీలో చేరారు. నాయకులు కొలిపాక శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్లు షఫీ తెలిపారు. ఆయనతో పాటు నవాబ్, ఎండి గౌస్, ఇంతియాజ్‌ఖాన్, ఎండి అహ్మద్, ఎండిసోను, షకీల్, ఆఫీజు, చంద్‌పాషా, నవీద్, హజార్, తదితరులు చేరారు. కార్యక్రమంలో కుక్క కనకరాజు, కుక్క చరణ్, మాచర్ల సాగర్, పేర్క సాయి, నరేష్, శ్రావణ్, సృజిత్, గనీ, విజయ్, శ్రీనాథ్, తిరుమల్, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily