P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : పెద్దపల్లి ఓదెల సెప్టెంబర్ 21 అక్షరం న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార కార్యక్రమాన్ని హరేరామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ప్రభుత్వ విప్, పె ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించడం జరిగింది... ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ ఈ అల్పాహారం వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.65 కోట్లతో పలు ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రహరీ, నూతన తరగతి గదులు, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. మిగిలి ఉన్న పనులను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు. విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణం అని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా నాయక్ ఎంపీడీఓ అనిల్ రెడ్డి మండల విద్యాధికారి, వై రమేష్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శిరీష కస్తూర్బా ఎస్ఓ జ్యోతి. స్థానిక సర్పంచ్, కనికి రెడ్డి సతీష్ సింగల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి నాయకులు గోపు నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గుండేటి ఐలయ్య యాదవ్ తోపాటు ఉపాధ్యాయులు, సింగల్ విండో డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily