Saturday, 18 April 2026 06:45:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కార్మికులు బతకాలంటే మోడీ దిగాలి ... (ఏఐఆర్ టి డబ్ల్యు ఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్

నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా వై విక్రమ్, జి ఉపేంద్ర...


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 September 2025 05:22 PM Views : 382

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9 (అక్షరంన్యూస్) మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇలాగే మరి కొన్ని సంవత్సరాలు వుంటే ఈ దేశంలో కార్మికులు పరిస్థితి మరింత దిగజారి కనీస ప్రమాణాలు పడిపోవడం ఖాయం అని తెలంగాణ పబ్లిక్@ ప్రయివేటు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ( ఏఐఆర్ టి డబ్ల్యు ఎఫ్ ) యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మంచికంటి పంక్షన్ హల్ జిల్లా ట్రాన్స్ పోర్ట్ 4వ మహాసభ రాందాస్ జరిగింది. ముందుగా జెండా ఆవిష్కరణ ను శ్రీకాంత్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో లాభాలు వున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రెండ్ అదానీ, అంబానీ లకు ధారాదత్తం చేశారు అని ఆరోపించారు. కార్మికుల చెమటతో ధనవంతులు గా ఒకవైపు పెట్టుబడిదారులు బాగా పెరిగారు అని కానీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వడానికి మోడీ చట్టం తేవడం లేదు అని ఆరోపించారు.రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆటో డ్రైవర్లకు నెలకు 12 వేల రూపాయలు ఇవ్వాని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు కనీస వేతనం 26000 ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పనిగంటలు 10 గంటలకు తీసుకురావడం దారుణం అని విమర్శించారు. దేశంలో ట్రాన్స్ పోర్ట్ రవాణా కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తోంది అని అటువంటి ట్రాన్స్ పోర్ట్ రంగం పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపి చూపించి డ్రైవర్ లపై కఠినమైన చట్టాలు తెచ్చారు అని ఆరోపించారు. రాబోయే కాలంలో జాతీయ కార్మిక సంఘాలు , స్వతంత్ర ఫెడరేషన్ లు ,రాష్ట్ర వ్యాపిత కార్మిక సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున సమీకరించి సమ్మెలకు పిలుపు ఇస్తాం అని హెచ్చరించారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష , ఏడు లక్షల జరిమానా ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు కఠినంగా శిక్ష విధించే భారత న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2) ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు అలాగే టూవీలర్ ద్వారా నడుస్తున్న రాపిడో ఓలా ఉబర్ లాంటి సంస్థల రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. అనంతరం ఈ మహాసభ జిల్లా ట్రాన్స్ పోర్ట్ సంఘం నూతన అధ్యక్షుడిగా వై విక్రమ్ ను, కార్యదర్శి గా జిల్లా ఉపేందర్ ను, కోశాధికారిగా ధరావత్ రాందాస్ ను ఎన్నుకున్నారు. 31 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు టి విష్ణు, నాయకులు పి మోహన్ రావు, బాబు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :