GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/రఘునాధపల్లి/( అక్షరం న్యూస్)సెప్టెంబరు 14: కడియం శ్రీహరిని ఇంకొక సారి విమర్శిస్తే...ఊరుకునే ప్రసక్తే లేదని.. రాసలీల రాజయ్య ఖబడ్డార్.. తాటా తీస్తామంటూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు మండిపడ్డారు. మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ ఉపాద్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డితో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడియం శ్రీహరిని విమర్శిస్తే కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడతానని. అనుకుంటు పగటి కలలు కంట ఉన్నావా...రాజయ్య... నీకు అంతా సీన్ లేదు. పులిని చూసి నక్క వాతలు పెటుకున్నటుంది నీ వ్యవహారం..ఏ మోఖం పెటుకొని పాద యాత్ర చేస్తున్నావ్. పనులను.. పదవులను. ప్రభుత్వ పథకాలను అమ్ముకున్న నీకు నిజంగా సిగ్గు..శరం..ఉంటే నీవు ఎమ్మెల్యేగాఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కడియంను విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్టేనని.. ఇప్పటికైనా గుర్తించుకొని బుద్ధిగా నడుచుకో. అని రాజయ్యకు హితవు పలికారు. అనంతరం కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాజయ్య దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్మణికంఠ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మేకల నరేందర్, గాదె మహేందర్ రెడ్డి, ఎండి.బాషుమియా,రమేష్, పర్శ సిద్ధేశ్, కుమార్, మహ్మద్ అబ్బాస్ మియా, రంగోజు ఈశ్వరయ్య. ఇబ్రహీం పాష, షబ్బీర్ మియా తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily