Saturday, 24 October 2026 09:54:51 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ జకీయ కురువృద్ధుడు పి.టి. స్వామి కన్నుమూత ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా విశేష సేవలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 24 October 2026 08:28 PM Views : 87

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతినగర్, ఎన్టీపీసీ: సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు, మాజీ ఉపాధ్యాయుడు, విద్యావేత్త పి.టి. స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం వసంత్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడంతో గోదావరిఖని ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, విద్యా సేవలు, కార్మిక ఉద్యమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1970లో గోదావరిఖని జవహర్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన పి.టి. స్వామి, అనంతరం విద్యారంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 1985లో మార్కండేయ కాలనీలో వాణి విద్యా విహార్‌ పాఠశాలను ప్రారంభించి, దానిని కళాశాల స్థాయి వరకు అభివృద్ధి చేశారు. ఈ విద్యాసంస్థలో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకవైపు విద్యాసంస్థను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పనిచేసిన ఆయన, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆ సమయంలో జిల్లాలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎడ్ల మల్లయ్యతో కలిసి జిల్లాలో పార్టీకి సంబంధించిన రెండు వర్గాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేకంగా గుర్తించేవారని పార్టీ వర్గాల్లో పేరుంది. సిరిసిల్ల ఎస్‌ఎస్‌ బోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ కొంతకాలం పనిచేసిన పి.టి. స్వామి, మాజీ స్పీకర్‌, మంథని మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీపాదరావుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామితోనూ కలిసి పనిచేశారు. 1998లో మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పార్టీ టికెట్‌ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రాజకీయాలకు దూరం కాకుండా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరిన ఆయన, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ప్రారంభం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, స్థలాల క్రమబద్ధీకరణ ఉద్యమాలు సహా పలు కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. రామగుండం, మంథని ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ, నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం వరకు బాధ్యతలు నిర్వహించేవారు. రాజకీయంగా ఉన్నత పదవులు దక్కాల్సిన స్థాయి, అనుభవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు లభించలేదనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉంది. రాజకీయాలతోపాటు సామాజిక సేవకు ప్రాధాన్యమిచ్చిన పి.టి. స్వామి, వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవలందించారు. విద్య, రాజకీయాలు, కార్మిక ఉద్యమాలు, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని, విద్యాభివృద్ధికి కృషి చేసిన సేవాభావం గల వ్యక్తిని ప్రాంతం కోల్పోయింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :