Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 30 (అక్షరం న్యూస్ ) పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల భ్రమరాంబ మల్లికార్జున ఆలయానికి ఆదివారం ఉగాది పండుగ పర్వదినాన భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు ఉగాది పండుగ సందర్భంగా ఆలయానికి విఐపి ల దర్శనం కూడా భారీగానే ఉన్నది ఈ సందర్భంగా పోత్కుపల్లి ఎస్సై దీకొండ రమేష్ సతి సమేతంగా చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు అర్చనలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అదేవిధంగా పండుగ సందర్భంగా మేకపోతుల రథం మండలంలోని హరిపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన మేకపోతుల రథంతో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు అదేవిధంగా యాదవుల ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామి కి తల్లా పెరుగు తీసుకువచ్చి భక్తులకు పంచిపెట్టారు వాహనాలకు పూజలు ఉగాది పర్వదినాన స్వామివారి సన్నిధానంలో జిల్లాలోని వివిధ గ్రామాలలో నుంచి అన్ని రకాల వాహనాలు పూజలు నిర్వహించారు వాహన పూజ సందర్భంగా భారీగా పూల వ్యాపారం జోరుగా సాగింది ఆలయంలో పంచాంగ శ్రవణం ఏవో బి సదయ్య మల్లికార్జున స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నాలుగు గంటలకు మొదలవుతుందని ఆలయ ఈవో బి సదయ్య పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారని పేర్కొన్నారు
.
Aksharam Telugu Daily