D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/అక్టోబర్ 24 (అక్షరంన్యూస్) రాజకీయంలో రాణించాలనుకునే యువతకు తమ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం యువతీ యువకులకు కనిపిస్తున్నామని, సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఇతర ఎన్నికల్లో జరిగిన ఆ ఎన్నికలలో పోటీ చేసేందుకు తమ పార్టీ అవకాశం కల్పిస్తుంది అన్నారు. బి ఫామ్ తక్షణమే అందజేసి వాటికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ మరింత బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే అనేక జిల్లాలలో పర్యటనలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతున్నామని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయ్యేందుకు తమ పార్టీ మంచి అవకాశాన్ని కల్పిస్తుందని, యువతీ యువకులు రాజకీయ చైతన్యం కలిపినప్పుడే ఈ సమాజం మరింత ముందుకు వెళుతుందని, ప్రజలకు సేవ చేయాలని దృక్పథం కలిగి ఉండాలని అటువంటి వారిని తమ పార్టీ సంపూర్ణంగా ఆహ్వానిస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ స్టార్ క్యాంపినర్, ఐ ఐ ఎస్ రిటైర్డ్ అధికారి కోనప్పరెడ్డి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర నేతలు స్టీవెన్, మేకల సారయ్య, చెరుకూరి రత్నరాజు, జాను ప్రభాకర్, జన్ను జాన్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily