D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం/ అక్టోబర్ 6(అక్షరం న్యూస్)మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం మండల జడ్పీటిసి కాంగ్రెస్ టికెట్ ను నేతకాని సామాజిక వర్గానికి కేటాయించాలని మంత్రి సీతక్క గారిని నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నరసన్న గారు వారి ప్రతినిధులు అందరూ కోరారు. గంగారం మండలంలో నేతకాని జనాభా అధికంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం అక్కడ జనరల్ రావడంతో తమ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు కు జడ్పీటిసి అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని వారు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జనగం లక్ష్మణ్, రాజం నర్సయ్య గోగు సునీల్, గాంధెర్ల కృష్ణ . రత్నం గోనే రామచంద్రరావు.తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily