Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 19(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలోని 19 వ వార్డ్ లో బుధవారం నీటీ ఎద్దడి నివారణ లో భాగంగా సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి చేతుల మీదుగా కొత్త బోరు మోటర్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు బోర్ వేసి మోటార్ను బిగించినట్లు తెలిపారు. నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ 19 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సావుల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చిత్తారీ,పద్మ బూరుగు కిస్తస్వామి,దొబ్బల అనిల్,గడిపే బాలు,కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసడెంట్ నగేష్,ఇండియన్ యూత్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఎం.డి అజీజ్ పాషా, హుస్నాబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అఖిల్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily