Monday, 26 October 2026 03:30:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైద్య రంగంలో వైరా యువ వైద్యురాలి ప్రతిభ.. అడ్వాన్స్డ్ ఆస్తమా కోర్సులో సర్టిఫికెట్ సాధించిన డాక్టర్ మిట్టపల్లి దీపిక...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 26 October 2026 01:27 PM Views : 145

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 26( అక్షరం న్యూస్) వైరా కీర్తిని చాటిన వైద్యురాలు.. మూడు నెలల ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి వైద్య రంగంలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే దిశగా వైరాకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ మిట్టపల్లి దీపిక మరో ముందడుగు వేశారు. ముంబైలోని నారాయణ ఎస్‌ఆర్‌సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ రూపొందించిన ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్డ్ ఆస్తమా కోర్సును విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్నారు. మూడు నెలల పాటు కొనసాగిన ఈ ప్రత్యేక కోర్సును హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. ఆన్‌లైన్ శిక్షణతో పాటు ప్రత్యక్ష తరగతుల్లో పాల్గొన్న డాక్టర్ దీపిక కోర్సును విజయవంతంగా పూర్తి చేసి తన వైద్య నైపుణ్యానికి మరింత పదును పెట్టుకున్నారు. ఆస్తమా వ్యాధికి సంబంధించిన అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో ఈ శిక్షణ ఆమెకు ఉపయోగపడనుంది. వైరాకు చెందిన మిట్టపల్లి శ్రీనివాసరావు, మంజుల దంపతుల కుమార్తె అయిన డాక్టర్ దీపిక సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరంతర అధ్యయనం, నూతన వైద్య విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలనే తపనతో ఆమె సాధించిన ఈ విజయాన్ని పలువురు అభినందిస్తున్నారు. వైద్య విద్యను నిరంతరం అభ్యసిస్తూ, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా వృత్తిపరంగా మరింత ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న డాక్టర్ దీపికకు ఈ సర్టిఫికెట్ మరో మైలురాయిగా నిలవనుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా ఛైర్మెన్ పువ్వాళ దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :