Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * * భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 18/ అక్షరం న్యూస్ - : అహలే సున్నత్వల్ జామాత్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ కరీం అధ్యక్షతన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. కొత్తగూడెం జామియ మసీద్ లో శుక్రవారం జరిగిన పోస్ట్ కార్డ్ ఉద్యమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అహలే సున్నత్వల్ జామాత్ కమిటీ ఛైర్మన్ యం.ఏ.రజాక్ కార్యక్రమన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సవరించిందని, ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ను తెలంగాణ రాష్ట్రం లో అమలు చేయవద్దు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు పోస్టు కార్డులు రాసి తమా అవేదనను వ్యక్తం చేశారు. జమ్మూ నమాజ్ అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ఏ.యస్.జే. చైర్మన్ యం.ఏ.రజాక్, జిల్లా అధ్యక్షుడు, షేక్ అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి షేక్ యఖుబ్ ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, జామియ మసీద్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్, అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా, మహబూబ్ ఖాద్రీ, మహమ్మద్ ఇస్మాయిల్ రైల్వే, మహమ్మద్ నీసార్, మహమ్మద్ షఫీ, షేక్ నయీమ్, మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ అక్తర్ పాషా, మోయిన్, యం.ఏ. రహమాన్, మరియు అధిక సంఖ్యలో ముస్లిం లు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily