Saturday, 18 April 2026 01:56:08 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ముఖ్యమంత్రి ముస్లింల పట్ల అలా అనకుండా ఉండాల్సింది :రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ నయీమ్ ఖురేషి

..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 08 November 2025 08:31 PM Views : 336

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / నవంబర్ 8 / అక్షరం న్యూస్ -: ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు బాగా లేవని, ఆయన అలా అనకుంటే బాగుండేదని రాష్ట్ర మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ముస్లిం ల సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింల పట్ల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అని కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారని కాంగ్రెస్ తోనే ముస్లింలకి మర్యాద దక్కుతుందని కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అన్న మాటలు ముస్లిల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తను కూడా కాంగ్రెస్ వాదినేనని కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో అనేక సెక్యులర్ పార్టీలు ఉన్నాయని దేశ ప్రజల్లో 70% సెక్యులర్ బావ జాలం వారు ఉన్నారని గుర్తు చేశారు. భూమి పుట్టినప్పటినుంచి ముస్లింలు ఉన్నారని, భూమి అంతమయ్యే వరకు ముస్లింలు అల్లాహ్, ప్రవక్త మొహమ్మద్ (స. అ. సం )ను నమ్ముకొని జీవనం సాగిస్తారని నయీమ్ ఖురేషి గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో అమీర్ ఖాద్రి, షమ్మీ, అక్బర్ జాఫర్ ఖురేషి,బాబు జానీ, జమాల్,జుబేద్ ఆలం,ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :