Friday, 06 March 2026 03:05:50 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆదివాసీ విద్యార్థులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 August 2025 07:27 PM Views : 630

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 10/ అక్షరం న్యూస్/----- మండల కేంద్రం లోని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్ది నిలయం నందు విద్యనభ్యాసిస్తున్న గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ వాస్తవ్యులు తుమ్మలపల్లి స్ఫూర్తి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చి ఎంతో పట్టుదలతో విద్యాభ్యాసిస్తున్న గిరి సోదరులకు రాఖీ కట్టడం ఆనందించదగ్గ విషయం అని ఆ చిన్నారి అన్నారు.నేను నీకు రక్షా నీవు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్షా అంటూ అతి పిన్న వయసులోనే సేవా గుణాన్ని ప్రదర్శించన స్ఫూర్తి నీ నిలయ కమిటీ సభ్యులు అభినందించారు. అనంతరం విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. గోగుబాక గ్రామానికి చెందిన సాగి వెంకట జగన్నాదరాజు (నానిబాబు రాజు) విద్యార్దులకు రూ. రెండు వేలు విలువ చేసే యాపిల్స్ బత్తాయి దానిమ్మ, అరటిపండ్లను అందచేశారు. వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత వియ్యంకులు ఆంద్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు కు చెందిన గుది వెంకట్రావు శ్రీవిద్య దంపతులు విద్యార్దులకు బొప్పాయి అరటిపండ్లు చాక్లెట్లు లను పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహయ సహకారాలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వక మైన కృతజ్ఞతాభిమానాలు తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :