GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -24(అక్షరం న్యూస్ ) మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో ఇబ్బందులు పడ్డ రైతులకు రైతులకు పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఎఫ్ ఎస్ (‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ )’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న యాప్‌తో ఇబ్బందులు పడ్డ రైతులపై ఇప్పుడు ఈ కేంద్రం రూపొందించిన యాప్ తో ఇబ్బందులు పడుతున్నారు.యూరియా కోసం ప్రభుత్వం తెచ్చిన కొత్త యాప్ విధానం వల్ల సర్వర్ సమస్యలు, ఓటీపీల ఆలస్యం, రిజిస్ట్రేషన్ కాకపోవడం లాంటి సాంకేతిక ఇబ్బందులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ అవగాహన లేని చిన్న రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.బుకింగ్ కు సమయం కేటాయించినప్పటికీ ఆ సమయంలో యాప్ పని చేయకపోవడం ఎర్రర్ రావడం. బుకింగ్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సర్వర్ సామర్థ్యాన్ని పెంచి బుకింగ్ సమయాన్ని రైతులకు అనుకూలంగా పెంచాలనిరైతులు కోరుతున్నారు
.
Aksharam Telugu Daily