D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 6 వైరా ( అక్షరం న్యూస్) . వైరా మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితర ముఖ్య నాయకులతో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని1.వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోర్ శ్రీకాంత్ .2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థని బత్తుల గీత 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉండ్రు వరలక్ష్మి 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాంపూడి రాజ్యలక్ష్మి 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచబంటి బలరామయ్య. విజయాన్ని కాంక్షిస్తూ వార్డులలో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జననీరాజనాలు పలకడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పష్టం చేశారు. ప్రచారంలో భారీ స్థాయిలో మహిళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ప్రజా సమస్యలను విస్మరించి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రజలు తగిన బుద్ధి చెప్పి గద్దె దించారని ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని ఇందిరమ్మ ఇల్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేస్తూ ఆర్థిక భారం ఎక్కువైనా కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తుందని వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఎవరు ఆపలేరని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు అండదండలు ఎల్లవేళలా ఉంటాయని . ప్రతిపక్ష పార్టీల ప్రచారాలలో స్పందినే కరువైందని ప్రజలు వారిని ఛీదరించుకుంటున్నారని ఇలాంటి ప్రజా ప్రభుత్వం పై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే వైరా రింగ్ రోడ్డు సెంటర్లో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల పొట్టలు కొట్టి షాపులను కూల్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని షాపులు కూలగొట్టి వైరా రింగ్ రోడ్డు సెంటర్ ను అద్వానంగా మార్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని ఏ ముఖం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించారని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసినట్టు ఆధారాలు చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.. మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలన్న పేద బడుగు బలహీనవర్గాలను అభివృద్ధి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్. పట్టణ అధ్యక్షుడు సీతారాములు మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి వైరా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళుపాటి సీతారాములు,యువజన విభాగం అధ్యక్షుడు గరిడేపల్లి కిషోర్. పమ్మి అశోక్ ,డాక్టర్ ఉండ్రు శ్యాంబాబు , పల్లపు కొండలు. బత్తుల శ్రీను వీరంశెట్టి, సీతారాములు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily