Sunday, 29 March 2026 03:30:26 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మండలంలోని ఆసుపత్రి సేవలు ఎన్నికల ఏర్పాట్లు మహిళా యూనిట్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 December 2025 06:02 PM Views : 724

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : .

భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల డిసెంబర్ 10/ అక్షరం న్యూస్/------ మండలం లోని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం చర్ల మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు మరియు గ్రామీణ మహిళా ఉత్పాదక యూనిట్ల పనితీరుపై సమగ్ర సమీక్ష చేస్తూ పలు కీలక సూచనలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఎమర్జెన్సీ, గైనకాలజీ , పీడియాట్రిక్ లేబర్ రూమ్ ల్యాబ్, ఫార్మసీ, మొత్తం మౌలిక సదుపాయాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, పరికరాల పనితీరు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, రికార్డు లు పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డ్ లో ఉన్న రోగులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్న చిన్నచిన్న లీకేజీలు మరమ్మత్తులు, గుర్తించిన కలెక్టర్ తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు అభివృద్ధి పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని వైద్య అధికారిని ఆదేశించారు. గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. తరువాత కలెక్టర్ చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి కౌంటర్‌ను పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న సామాగ్రి పంపిణీ విధానాన్ని, చెక్‌లిస్ట్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియలను సవివరంగా పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, సీల్‌లు, స్టాంపులు, ఫారమ్‌లు తదితర ఎన్నికల సామాగ్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది హాజరు, డబుల్-లాక్ సిస్టమ్‌ను పరిశీలించి ఎటువంటి భద్రతా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్, ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించడానికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సహకారం తక్షణమే అందించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలను కూడా పరిశీలించి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ సుబ్బంపేట గ్రామంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన ర్యాంపులు, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయాలు, వెబ్‌కాస్టింగ్ కోసం అమర్చిన వీడియో కెమెరాల పనితీరును సమీక్షించారు. పోలింగ్ రోజున ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో అమలులో ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ ఆర్.కొత్తగూడెంలోని శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు, బర్ఫీ, చాక్లెట్, టీ పొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్పపువ్వు సేకరణ విధానం, నాణ్యత, నిల్వ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ, పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవసరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పపువ్వు ఎండబెట్టేందుకు సోలార్ డ్రైయర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా, వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి వర్ధన్ డాక్టర్ కాంత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రావణి, చర్ల ఎంపీడీవో, శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లైబిలిటీ యూనిట్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :