D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే23(అక్షరం న్యూస్ )మహబూబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామానికి చెందిన వజ్జ జంపయ్య 5 ఎకరాలు చుంచ పాపయ్య 4 ఎకరాలు రైతులు ఆరబోసిన మొక్కజొన్న ధాన్యానికి అకస్మాత్తుగా ఎరగలు (నిప్పురవ్వలు/మంటలు) అంటుకున్నాయి. ఎండ తీవ్రతకు మంటలు క్షణాల్లో వ్యాపించడంతో, ఆరబోసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది.కళ్లముందే తమ ఏడాది కష్టం అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు, అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily