Friday, 03 April 2026 01:52:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బయ్యారంలో జోరుగా పేకాట....? -అప్పులపాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు.

పట్టించుకోని అధికారులు.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 02 April 2026 08:18 PM Views : 15

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : - బయ్యారం అక్షరం న్యూస్ 02 బయ్యారం మండలం కేంద్రంలో పేకాట జోరుగా సాగుతున్నది.సరదాగా మొదలై..ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది.పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.యువత పేకాటకు మొదట ఆకర్షితులై వ్యసనంగా మారుతున్నారు.మండల కేంద్ర శివారు ప్రాంతాల్లో పేకాటరాయుళ్లు,గ్రామస్తులకు కనబడకుండా గ్రామశివార్లను అడ్డాగా చేసుకుంటున్నారు.పాలవాగు పరీవాహక ప్రాంతం,పొలాలు,గాజులబోడు ఉన్న ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నాట్లు సమాచారం.వేల రూపాయలు చేతులు మారుతున్నాయి.ఆటవద్దే మినీ ఫైనాన్షియర్లు..ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు పేకాట కొనసాగుతున్నది.ఉదయం వేళల్లో పేకాట నిర్వాహకులు రెక్కీ నిర్వహించి ఏ ప్రాంతం అయితే ఆటకు ఇబ్బంది ఉండదో,ఏ ప్రాంతంలో ఆట పెడితే పేకాటరాయుళ్లు వస్తారో అక్కడ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు.పేకాడే స్థలానికి కొద్ది దూరంలో నిఘా ఉంచుతారు.పేకాడుతుండగా డబ్బులు పోయిన వారికి మినీ ఫైనాన్షియర్లు అప్పులు ఇస్తున్నారని,రూ. 10 వేలు ఇస్తే తర్వాత రూ. 11 వేలు ఇవ్వాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తున్నది.మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆట కొనసాగిస్తున్నట్లు సమాచారం..పేకాటతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.యువకులు అప్పుల బారిన పడుతున్నారు.పేకాట ఆడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని,పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :