AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 11 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ-ఎస్ఐఆర్- 2026 అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 7వ వార్డులో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను అధికారులు, ప్రజాప్రతినిధులు వేగవంతం చేశారు. 7వ వార్డు కౌన్సిలర్ ఈర్ల స్వరూప-సురేందర్ గత వారం రోజులుగా బూత్ స్థాయి అధికారులతో కలిసి వార్డులో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాలో కొత్తగా పేర్ల నమోదు,చిరునామా మార్పులు,అభ్యంతరాల తొలగింపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫారమ్‌లను నింపడంలో ప్రజలకు సిబ్బంది ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు.ఈ ప్రత్యేక నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు శనివారం పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,తహసిల్దార్ రాజయ్య 7వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఈర్ల స్వరూప-సురేందర్ వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం అధికారులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరుగుతూ, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వరూప మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు అత్యంత కీలకమైనది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026లో భాగంగా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని,అర్హులైన ప్రతి పౌరుడు తమ వివరాలను నమోదు చేసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలి. అని పిలుపునిచ్చారు. ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడానికి జూలై 24ను గడువుగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎల్వోలు రజిత, ఉమారాణి, వార్డు ఆఫీసర్ అశ్విత, వార్డునాయకులు కట్ల అన్వేష్,అనాజ్ ఈశ్వర్,వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily