D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -05(అక్షరం న్యూస్ ) ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని నెల రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందారువివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల వాటర్ ప్లాంట్ చెడిపోయింది. నాటి నుంచి దాదాపుగా రెండు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్ పనిచేయక ప్రజలకు మంచినీళ్లు అందకుండా పోయాయి.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాచెట్టి లక్ష్మణ్ గుప్తా తాను గెలిస్తే నెల రోజుల్లో మంచి నీటి సమస్య పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ మేరకు మళ్లీ సురక్షితమైన మంచినీటిని గ్రామ ప్రజలకు అందించి ప్రజల చేత శభాష్ అని అనిపించుకున్నాడు. ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మణ్ గుప్తా మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు
.
Aksharam Telugu Daily