D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 15(అక్షరం న్యూస్) దళిత జాతికి చెందిన వారిఓటుబ్యాంకును ఉపయోగించుకుంటూఎమ్మెల్యే గా గెలిచిన ధనసరి సీతక్క దళిత గ్రామాలను పైలేట్ గ్రామాలుగా తీసుకోకుండా దళిత గ్రామాలను పట్టించుకోవడంలేదని నేత కాని మహర్ కుల సంఘ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు దుర్గం మురళి నేత ఆరోపించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ దళిత ఎస్సీ రిజర్వేషన్ కు చెందిన ములుగు నియోజకవర్గంలో ధనసరి సీతక్క ఏడు మండలాల్లో ఏ ఒక్క ఎస్సీ గ్రామాన్ని కూడా పైలేట్ గ్రామంగా ఎంపిక చేయలేదని అన్నారు గంగారం మండలం లోని కోమట్లగూడెం మామిడి గూడెం గ్రామాలు పూర్తిగా ఎస్సీ కుటుంబాలే ఉన్నాయని కోమట్లగూడెంలో చాలా మందికి ఇల్లు లేవని గతంలో వర్షాలకు కూలిపోవడం జరిగిందని వారందరికీ డబుల్ బేడూరూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే కాటినగర్ నుండి జంగాల పల్లి వెళ్ళంటే బ్రిడ్జి నిర్మించాలని ఆయన అన్నారు ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily